’జనాలు అసలు ఆగట్లేదు గా .. మాస్క్ వేసుకుని మరి..?

ఈ లాక్ డౌన్ నేపథ్యంలో తాజాగా జరుగుతున్న సెలబ్రిటీల పెళ్లిళ్లపై అనుచిత కామెంట్స్ చేస్తూ , సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది, హీరోయిన్ కం బిజెపి నాయకురాలు మాధవి లత. ఈనెల 14న షామీర్ పేటలోని ఓ గెస్ట్ హౌస్ లో అతి కొద్ది మంది సన్నిహితుల మధ్య హీరో నిఖిల్ సిద్ధార్థ్ నిరాడంబరంగా తన ప్రేయసి డాక్టర్ పల్లవి వర్మ ను పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే.
అదేరోజు క్యారెక్టర్ ఆర్టిస్ట్ జబర్దస్త్ మహేష్ పెళ్లి కూడా జరిగింది. ప్రభుత్వం విధించిన లాక్ డౌన్ రూల్స్ పాటిస్తూ ఈ జంటలు చాలా సింపుల్ గా పెళ్లికానిచేశారు. కాగా టాలీవుడ్ నిర్మాత దిల్ రాజు కూడా సడన్ గా రాత్రిపూట పెళ్లి చేసుకున్నారు . ఈ లాక్ డౌన్ లో జరుగుతున్న పెళ్లిళ్లపై.. మాధవి లత కాస్త ఘాటుగా స్పందించింది.

తన ఫేస్ బుక్ లో పోస్ట్ చేస్తూ ‘ పెళ్లిళ్లు చేసుకోవడం ఎందుకో’’..! మళ్లీ ముహూర్తాలు రావా ? ఇదిగో శ్రవణం .. అదిగో మాఘమాసం.. ఈ సంవత్సరం కాకపోతే వచ్చే సంవత్సరం. అంతేగాని మళ్లీ పిల్లోడు దొరకడా , పిల్ల పోతుందా .. అలా మారిపోయే బంధాలు ఎందుకు ! మాస్క్ వేసుకుని మరీ పెళ్లిళ్లు అవసరమా ? ఆగలేని సంసారాలు చేస్తారా? ఈ పెళ్లిళ్ళు ఏంటో.. నాకు అర్థం కావట్లేదు. పీపుల్ ఫస్ట్ బి క్రేజీ..నో ..నో .. గాడ్ మస్ట్ బి క్రేజీ.. అంటూ పోస్ట్ చేసింది. ఇక చివర్లో నా పోస్ట్ ఇష్టం.. నా అభిప్రాయం నేను చెప్పా.. నా ఫీలింగ్స్ చెప్పే రైట్స్ నాకుంది. అంటూ పోస్ట్ చేశారు.

Add a Comment

Your email address will not be published. Required fields are marked *