ఓటిటి లో .. మెగా హీరో ఫస్ట్ మూవీ

మెగా కాంపౌండ్ నుంచి వస్తున్న మరో యువ కెరటం , వైష్ణవ్ తేజ్ .తొలి చిత్రం ఉప్పెన తో టాలీవుడ్ లో అడుగు పెడుతున్నాడు. సుకుమార్ శిష్యుడు బుచ్చి బాబు డైరెక్షన్లో రూపొందుతున్న, ఈ సినిమాను మైత్రి మూవీ మేకర్స్ ప్రొడ్యూస్ చేస్తున్నారు. ఈ లాక్ డౌన్ లో సినిమా థియేటర్లు మూతపడడంతో ఉప్పెన మూవీ రిలీజ్ వాయిదా వేశారు.
ఎప్పుడు సినిమా థియేటర్స్ తెరుస్తారు , ఎప్పుడు రిలీజ్ చేస్తారో తెలియని టైంలో, ఈ సినిమా విడుదల విషయంలో స్పష్టత వచ్చినట్టుంది. తాజా సమాచారం ప్రకారం ఉప్పెన మూవీ డైరెక్ట్ గా ఓ టి టి లో రిలీజ్ చేసేందుకు మైత్రి మూవీ మేకర్స్ ప్లాన్ చేస్తున్నారట. అమెజాన్ ప్రైమ్, లేదా ఆహ లో ఈ సినిమాను రిలీజ్ చేయాలనుకుంటున్నారట.
మధ్య కొత్త సినిమాలను డైరెక్టుగా ఓ టి టి లో రిలీజ్ చేయడం అనే కొత్త కాన్సెప్ట్ ను ఫిలిం మేకర్స్ ఇప్పుడిప్పుడే అలవాటు చేసుకుంటున్నారు. డెబ్యు హీరో మూవీస్ ను o t t లో రిలీజ్ చేయడం కొత్త విషయమే. ఈ సినిమా లో తమిళ్ యాక్టర్ విజయ్ సేతుపతి ముఖ్య రోల్లో నటిస్తున్నాడు. అందుకే ఈ సినిమాను ఓ టి టి లో రిలీజయితే తమిళ ప్రేక్షకులకు కూడా ఈ సినిమా చూసే అవకాశం దక్కుతుంది.. ఈ విషయంపై త్వరలోనే క్లారిటీ రావచ్చు అనుకుంటున్నారు.

Add a Comment

Your email address will not be published. Required fields are marked *