చైనా యాప్ టిక్ టాక్ కు … అమెరికాలో మరో భారి దెబ్బ !

ప్రపంచంలోని యువతను ఉర్రూతలూగిస్తున్న క్రేజీ యాప్ టిక్ టాక్ ,ఇది చైనా వాళ్ల యాప్.. సోషల్ మీడియాలో టిక్ టాక్ యాప్ కు అమెరికాలో మరోసారి ఎదురుదెబ్బ గట్టిగా తగిలింది. జాతీయ చిన్నారుల భద్రత చట్టాన్ని ఈ యాప్ వాళ్ళు ఉల్లంగిఇచ్చారంటూ, బెర్కేర్లి మీడియా స్టడీస్ గ్రూప్, కన్జ్యూమర్ యాక్షన్, కన్జ్యూమర్ ఫెడరేషన్ ఆఫ్ అమెరికా తదితర అద్య్వకసీ గ్రూప్ లు టిక్ టాక్ యాజమాన్యంపై మండిపడ్డాయి. నిబంధనలు అతిక్రమించి, అక్రమంగా సేకరించిన 13 ఏళ్ల లోపు పిల్లల డేటాను ఇంతవరకు తన ప్లాట్ఫామ్ నుంచి తొలిగించలేదని, ఆ కంపెనీలు ఆరోపించాయి . 2019 ఫిబ్రవరి నెలలో ఎఫ్ టి సి తో కుదుర్చుకున్న ఒప్పందాన్ని ఉల్లంగి ఇచ్చిందని ఆరోపించాయి. తాజాగా టిక్ టాక్ పై గురువారం ఎఫ్ టి సి కి ఫిర్యాదు చేశాయి.

ఈ సినిమా డైలాగులు, పాటలకు, భావోద్వేగాలకు అనుగుణంగా వీడియోలు ఆడియోలు అప్లోడ్ చేయడం ద్వారా తమ టాలెంట్ను నిరూపించుకునే అవకాశం ఉందని టిక్ టాక్ అన్ని వర్గాల వాళ్ళు, వయసుతో సంబంధం లేకుండా ఆసక్తి కనబరుస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా కాలిఫోర్నియాకు చెందిన మ్యూజికల్ l y అనే మరో యాప్ గ్రూప్ టిక్ టాక్ తో 2018లో ఒక ఒప్పందం కుదుర్చుకుంది. ఈ యాప్ లో ఎవరైనా నా ఈజీగా అకౌంట్ క్రియేట్ చేసుకునే సదుపాయం కల్పించింది. తల్లిదండ్రుల అనుమతి లేకుండా 13ఏళ్ల లోపు చిన్నారుల నేమ్స్,, ఫొటోస్ ఇతర వ్యక్తిగత వివరాలను బయట పెట్టింది. అంటూ ఎఫ్ టి సి కి అనేక ఫిర్యాదులు అందాయి.

దీంతో టిక్ టాక్.. అమెరికా జాతీయ చిన్నారుల చట్టాన్ని ఉల్లంఘించిoదని పేర్కొంటూ ఎఫ్ టి సి.. టిక్ టాక్ యాజమాన్యానికి 5. 7 మిలియన్ డాలర్ల[ దాదాపు 40 . 60 కోట్ల రూపాయల] భారీ జరిమానా విధించింది. ఈ విషయంపై స్పందించిన టిక్ టాక్ యాజమాన్యం పిల్లలకు, యూజర్లకు భద్రత కు తగిన చర్యలు తీసుకుంటామని వివరణ ఇచ్చింది. జరిమానా చెల్లించింది.

Add a Comment

Your email address will not be published. Required fields are marked *