విజయ్ దేవరకొండ ఫైటర్ సినిమా కోసం మార్షల్ ఆర్ట్ నేర్చుకుంటున్నాడు

విజయ్ దేవరకొండ హీరోగా డాషింగ్ డైరెక్టర్పూరి జగన్నాథ్ దర్శకత్వంలో “ఫైటర్” అనే సినిమా తెరకెక్కుతుంది. ప్రస్తుతం ప్రీ పొడక్షన్ పనులు చేసుకుంటున్న ఈ చిత్రం నటీనటుల కోసం ఆహ్వానం పలుకుతోంది. అయితే ఈ సంవత్సరం ఇస్మార్ట్ శంకర్సినిమా ద్వారా హిట్ కొట్టిన పూరి జగన్నాథ్ విజయ్ తో తీస్తున్న ఫైటర్ సినిమాని పాన్ ఇండియా రేంజ్ లో తెరకెక్కించాలని చూస్తున్నాడట. అర్జున్ రెడ్డిసినిమా ద్వారా విజయ్ కి బాలీవుడ్ లోనూ మంచి ఫాలోయింగ్ ఏర్పడింది.

అదీ గాక పూరి జగన్నాథ్ కి కూడా బాలీవుడ్ లో కొంత ఫాలోయింగ్ ఉంది. వీటన్నింటిని దృష్టిలో పెట్టుకుని ఈ సినిమాని పాన్ ఇండియా రేంజ్ లో చేయాలని భావిస్తున్నారట. అందుకని ఈ సినిమా మీద ప్రత్యేక దృష్టి పెట్టాడట పూరి… స్క్రిప్టు అందరికీ నచ్చే విధంగా మరింతగా మెరుగులు దిద్దుతున్నాడట. అయితే ఇదిలా ఉంటే ఈ సినిమాలో విజయ్ దేవరకొండ బాక్సర్ గా కనిపించబోతున్నాడని తెలిసిందే..

కాబట్టి ఈ సినిమా కోసం విజయ్ దేవరకొండ మార్షల్ ఆర్ట్స్ లో శిక్షణ పొందుతున్నారు. 14 మంది మార్షల్ ఆర్ట్స్ నిపుణులు ఆయనకు శిక్షణ ఇస్తున్నారు. మిక్స్డ్ మార్షల్ ఆర్ట్స్ మరియు ఇతర యుద్ధ విద్యలను ఆయన నేర్చుకుంటున్నారట. దీని కోసం ఆయన కఠిన కసరత్తులు చేస్తున్నారని సమాచారం. గతంలో కిక్ బాక్సింగ్ నేపథ్యంలో పూరి తీసిన అమ్మా నాన్న ఓ తమిళఅమ్మాయిసినిమా ఎంతటి విజయం సాధించిందో అందరికీ తెలిసిందే…

మళ్ళీ అలాంటి హిట్ ఈ సినిమా ద్వారా సాధిస్తాడా లేదా చూడాలి. ఈ సినిమాని పూరి కనెక్ట్స్ బ్యానర్ లో పూరి మరియు ఛార్మిలు ఇద్దరు కలిసి సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఇందులో హీరోయిన్ గా శ్రీదేవి కూతురు జాన్వీ కపూర్ నటించనున్నట్లుగా సమాచారం.

Add a Comment

Your email address will not be published. Required fields are marked *