షాహీద్‌క‌పూర్ `జ‌ర్సీ` రీమేక్‌లో షూటింగ్‌లో ప్ర‌మాదం!

నిన్ను కోరి ఈ సినిమాతో మంచి ఊపు మీద ఉన్న నేచుర‌ల్ స్టార్ నాని హీరోగా న‌టించిన చిత్రం `జెర్సీ`. గౌత‌మ్ తిన్న‌నూరి రూపొందించిన ఈ చిత్రం తెలుగులో భారీ ఘన విజ‌యాన్ని సాధించ‌డ‌మే కాకుండా విమర్శ‌కుల ప్ర‌శంస‌ల్ని సొంతం చేసుకుంది. న‌టుడిగా నానికి మంచిమంచి హీరోగా పేరు తెచ్చిపెట్టింది. ఈ సినిమాను హిందీలో రీమేక్ చేస్తున్న విష‌యం తెలిసిందే. `అర్జున్‌రెడ్డి` రీమేక్‌తో బ్లాక్ బ‌స్ట‌ర్‌ని సొంతం చేసుకున్న షాహీద్‌క‌పూర్ `జ‌ర్సీ` రీమేక్‌లో న‌టిస్తున్నారు. బోనీక‌పూర్‌తో క‌లిసి దిల్‌రాజు ఈ చిత్రాన్నినిర్మిస్తున్నారు.

ఈ మధ్యనే ఈ సినిమా షూటింగ్ ఘనంగా గాప్రారంభ‌మైంది. ముంబైలోని బాంద్రాలో షాహీద్‌క‌పూర్ పాల్గొన‌గా ప‌లు కీల‌క స‌న్నివేశాల్ని చిత్రీక‌రించారు. ఇటీవ‌ల మొహ‌లీలో జ‌రుగుతున్న షూటింగ్‌లో హీరో షాహీద్‌ కపూర్కుకు గాయ‌మైన‌ట్టు తెలిసింది . గాషూటింగ్ లో భాగంగా. వేగంగా వ‌చ్చిన బంతి హీరో పెద‌వుల‌కు త‌గ‌ల‌డంతో గాయ‌మైన‌ట్టు వార్త‌లు వినిపిస్తున్నాయి. ర‌క్త స్రావం కావ‌డంతో స‌మీపంలో వున్న ఆసుప‌త్రికి షాహీద్‌ని చిత్ర యూనిట్ తీసుకెళ్లి వైద్యం ఇప్పించార‌ట‌.

షాహీద్ పెద‌వుల‌కు 12 కుట్లు ప‌డిన‌ట్టు బాలీవుడ్ వ‌ర్గాల స‌మాచారం. దీంతో షూటింగ్‌కి తాత్కాలికంగాబ్రేక్ ఇచ్చేశార‌ట‌. క్రికెట‌ర్‌ ర‌మ‌న్ లాంబా బాల్ త‌గ‌ల‌డం వ‌ల్లే మైదానంలోనే ప్రాణాలు వ‌దిలారు. ఆయ‌న జీవిత క‌థ స్ఫూర్తితో `జ‌ర్సీ`ని తెర‌పైకి తీసుకొచ్చార‌ని ప్ర‌చారం జ‌రిగింది.

Add a Comment

Your email address will not be published. Required fields are marked *