రష్మికను చాలా పరిమితంగా వాడేసిన తీరు చూస్తుంటే..

కొన్ని సినిమాలు ట్రైలర్ ను చూస్తే.. సినిమాను అంతా చూసినట్లే అనిపించేట్టుగా ఉంటాయి అలా .అలా కొన్నిసినిమాలు ఉంటాయి. ఒక పేరున్న హీరోకి సినిమాలో ఇలాంటివి చాలా అరుదుగా ఉంటుంది. అది కూడా ఒక పాత్రకు సంబంధించి. టీజర్ చూసినంతనే.. సినిమా మీద అంచనాల్ని భారీగా పెంచేసే సరిలేరు నీకెవ్వరు చిత్రంలో.. హీరోయిన్ రష్మిక
సరిలేరు నీకెవ్వరు టీజర్ చూసినప్పుడు హీరోయిన్ రష్మిక సీన్లు మొత్తం వినోదాత్మకంగా ఉండటమే కాదు.. సినిమా ఫన్ ప్యాక్ గా ఉంటుందన్న భావన కలుగక మానదు. టీజర్ లోనే ఇంత ఫన్ ఉంటుందంటే.. సినిమాలో మరింత ఎక్కువగా ఉంటుందని ఆశించిన వారికి షాకిచ్చాడు దర్శకుడు అనిల్ రావిపూడి.

ఒక్కమాటలో చెప్పాలంటే.. టీజర్ లో చూపించిన సన్నివేశాలు కాకుండా.. సినిమా లో మరో రెండు మూడు సీన్ లు.. క్లైమాక్స్.. పాటలు మాత్రమే ఉండటం విశేషం. యూత్ లో రష్మికకు ఉండే క్రేజ్ అంతా ఇంతా కాదు. అలాంటిది రష్మికను చాలా పరిమితంగా వాడేసిన తీరు చూస్తుంటే.. మరీ ఇంత తక్కువగా వాడతారా? అన్న భావన కలగటం ఖాయం. సరిలేరు నీకెవ్వరు చూసిన తర్వాత.. అరే.. సినిమాలో రష్మికను ఇంత మాత్రమే వాడారా? మరింత వాడేస్తే బాగుండేదనిపించక మానదు.

Add a Comment

Your email address will not be published. Required fields are marked *